కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చేసిన విలీనం ప్రతిపాదనకు ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆమోదం తెలిపారు. చిరు తీసుకున్న నిర్ణయం సరైనదే. కాంగ్రెస్ లో వై ఎస్ రాజ శేఖర రెడ్డి లేని లోటును సోనియా బృందం గుర్తించింది. వై ఎస్ స్థానాన్ని చిరు భర్తీ చేయగలరు. అయితే చిరు వై ఎస్ లా గట్టి లీడర్ కానప్పటికీ సోనియా దన్ను వుండటం చిరు కి కలసి వచ్చే అంశం. వై ఎస్ అమలు చేసిన పధకాలతో పాటు చిరు క్లీన్ ఇమేజి కూడా కాంగ్రెస్ కి కలసి వస్తుంది. ఇప్పుడు అంధ్ర ప్రదేశ్ లో పోరు కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల మధ్య నేరుగా వుంటుంది. తెలంగాణా లో తెరాస, ఆంధ్రా లో జగన్ ల ప్రభావం నామ మాత్రంగా వుంటుంది. భారతీయ జనతా పార్టీ కి మిత్ర పక్షం దొరకదు. భాజాపాకి తెరాస మద్దతు ఇస్తుంది కానీ తీసుకోదు. (ముస్లిం వోట్లు పోతాయని భయంతో). జగన్ది కూడా అదే పరిస్తితి. కమ్యూనిస్టులు ఎలాగైనా తెదేపా తోనే ఉండక తప్పదు.
No comments:
Post a Comment