Tuesday, 22 February 2011

Hats-off Chandra Babu

ఈ రోజు అసెంబ్లీలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు.  అదే సందర్భంలో ఆ పార్టి ఎమ్మెల్యేలు తెలంగాణా, సమైక్యాంధ్ర అంటూ పార్టీని గాలికి వదిలేశారని కూడా బాబు వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, తెలంగాణా గురించి  వాదించే కే కే, కా కా వంటి వారు యెంత మంది వున్నా  దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి సమర్ధుడైన నాయకుడిగా వుండి అటు పార్టీని ఇటు రాష్ట్రాన్ని కూడా చక్కగా నడిపించారు.  అప్పట్లో ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి పై ఢిల్లీకి ఎన్ని ఆరోపణలు చేసినా అయన చలించ లేదు.  బాబు విషయంలో అటువంటి పరిస్తితి లేదు, రాదు కూడా.  మరి పార్టీని నడిపించడంలో, ప్రజలకు దిశా నిర్దేశం చేయడంలో బాబు ఎందుకు విఫలం అవుతున్నారు?  కేవలం పత్రికల్లో లేదా టీవీల్లో కనిపించక పొతే ఎలాగా అనుకుంటూ కెసిఆర్ పార్టీతో, జగన్ తో పోటీ పడటంతో బాబు, అయన పార్టీ సహచరులు తేలిక అయ్యారు.  ఆ యిద్దరి  విషయంలో బాబు, తెదేపాలు పట్టించుకోనట్లుగా వుంటేనే ప్రయోజనం వుంటుంది.  కెసిఆర్, జగన్ వర్గాలు ఆందోళనలు చేసినప్పుడు వారి లక్ష్యాలు ఏమైనప్పటికీ వారు ప్రస్తావించే విషయాలకు తెదేపా దూరంగా వుండాలి.  విద్వేషాలను  ప్రోత్సహించే ప్రాంతీయ సంఘటనల పై పార్టీ వాదులు ఎవరూ ప్రకటనలు యివ్వకుండా చూసినప్పుడే బాబు కలలు కన్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యపడుతుంది. 

Thursday, 17 February 2011

Attack on JP

ఈరోజు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దుర్దినం. ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్న రాజకీయ పార్టీ లోక్ సత్తా.  ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో వార్త పత్రికల ప్రతినిధుల ముందు లోక్ సత్తా అధ్యక్షుడు, శాసన సభ్యుడు డాక్టర్ జయ ప్రకాష్ పై తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎం ఎల్ ఏలు కొట్టి నానా బూతులు తిట్టారు.  ఈ చర్యను ఖండిచాలని నేను కోరదలుచుకోలేదు.  ఇటువంటి సంఘటన తిరిగి జరగకుండా చూడాలని కూడా నేను కోరడం లేదు. ఈ దాడి చేసినవారిని బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నా.  టివి చానెల్స్, పేపర్ విలేఖరులు ఈ దాడి చేసినవారిని దోషులుగా చూపించి, వారికి సంబంధించిన వార్తలను బహిష్కరించడమే సరియైన చర్య.  అప్పుడు మాత్రమే ఇటువంటి అవమానాలు జరుగకుండా నివారించడం సాధ్య పడుతుంది.

Sunday, 6 February 2011

AP Politics: Chiru agrees Sonia proposal

కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చేసిన విలీనం ప్రతిపాదనకు ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆమోదం తెలిపారు.   చిరు తీసుకున్న నిర్ణయం సరైనదే.  కాంగ్రెస్ లో వై ఎస్ రాజ శేఖర రెడ్డి లేని లోటును సోనియా బృందం గుర్తించింది.  వై ఎస్ స్థానాన్ని చిరు భర్తీ చేయగలరు.  అయితే చిరు వై ఎస్ లా గట్టి లీడర్ కానప్పటికీ  సోనియా దన్ను వుండటం చిరు కి కలసి వచ్చే అంశం.  వై ఎస్ అమలు చేసిన పధకాలతో పాటు చిరు క్లీన్ ఇమేజి కూడా కాంగ్రెస్ కి కలసి వస్తుంది.  ఇప్పుడు అంధ్ర ప్రదేశ్ లో పోరు కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల మధ్య నేరుగా వుంటుంది.  తెలంగాణా లో తెరాస, ఆంధ్రా లో జగన్ ల ప్రభావం నామ మాత్రంగా వుంటుంది.  భారతీయ జనతా పార్టీ కి మిత్ర పక్షం దొరకదు. భాజాపాకి  తెరాస మద్దతు ఇస్తుంది కానీ తీసుకోదు. (ముస్లిం వోట్లు పోతాయని భయంతో).  జగన్ది కూడా అదే పరిస్తితి.  కమ్యూనిస్టులు ఎలాగైనా తెదేపా తోనే ఉండక తప్పదు.