పచ్చి మిరపకాయల కారం.
కావలసినవి .
పచ్చిమిరపకాయలు - 150 గ్రా
చింతపండు - 50 గ్రా
ఉప్పు -- తగినంత
బెల్లం - చిన్న ముక్క ( ఇష్టం లేని వారు మానేయవచ్చు . )
పసుపు - కొద్దిగా
నూనె -- అయిదు స్పూన్లు
పోపుకు .
పొట్టు మినపప్పు / లేదా
చాయమినపప్పు -- రెండు స్పూన్లు .
ఆవాలు - అర స్పూను
మెంతులు -- పావు స్పూను
ఇంగువ -- మరి కాస్త
తయారీ విధానము .
పచ్చిమిర్చి తొడిమలు తీసి కడిగి తడి లేకుండా ఆర నివ్వాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే పచ్చిమిర్చి వేసి మూత పెట్టు కోవాలి.
మూత పెట్టకపోతే పచ్చిమిర్చి పేలతాయి.
మూడువంతులు పైగా మగ్గాక కొద్దిగా పసుపు వేసి దింపుకోవాలి.
చింతపండు విడదీసుకుని ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మిద బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు నూనె వేసి
మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోవాలి .
పచ్చిమిరపకాయలు కారం కాబట్టి పోపులో ఎండుమిర్చి వేయనక్కరలేదు .
ఇప్పుడు మిక్సీ లో మగ్గబెట్టిన పచ్చిమిర్చి , చింతపండు , సరిపడా ఉప్పు మరియు చిన్న బెల్లం ముక్క( ఇష్టమైన వారు ) వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలి .
చివరగా పోపు కూడా వేసి పచ్చడి మరోసారి మిక్సీ వేసుకోవాలి .
ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
చింతపండు సమంగా పడకపోతే కారంగా ఉంటుంది .