Thursday, 30 November 2017

పాఠోళి

ఇది తెలుగు వాళ్ళదే. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది.
Authentic version: కందిపప్పు నానబెట్టి సరిపడ ఎండుమిర్చి , ఇంగువ, జీలకఱ్ఱ, వుప్పు వేసి కచ్త్చపచ్చ రుబ్బి నూనెబాగా వేసి రుబ్బిన పిండిని వాయలు వాయలు గా బంగారు రంగు వచ్చి కరకర వాడు వరకు వేయిస్తారు. అన్నంలో ఆధరువుగా తింటారు.
Kamala’ recipe ( పాఠోలీ)
రుబ్బటం వరకు పై విధంగానే.
తరువాత పిండిని కుక్కర్ గిన్నె( నూనె రాసిన) లోఆవిరిమీద వుడికించి
చల్లారాక చిదిపి నూనె బాగా వేసి పోపు చేసి ( కరివేపాకు పచ్చిమిర్చిముక్కలు, వుల్లి ముక్కలు కూడా వేసి) చదివిన పప్పును బాగా వేయించాలి. ఇది పలహారంలాగా కూడా తినవచ్చు.

Wednesday, 29 November 2017

పాలపొడి అటుకుల గులాబ్ జాం

పాలపొడి ఇంకా అటుకులు కలిపి గులాబ్ జాం

ఎప్పుడు చూసిన గులాబ్ జాం పొస్ట్స్ పెడుతుంది అనుకోకండి ఎందుకంటే అందరికి అన్ని రకాల వంటల గురించి తెలియాలి కదా.

తయారీ విధానం
ముందుగా 1కప్ అటుకులని కడిగి ఒక అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి తరువాత దీనిలో అరకప్పు పాలపొడి వేసుకుని వంటసోడా వేసుకుని 2స్పూన్స్ పాలు వేసుకుని ముద్దలా కలుపుకుని ఉండలా చుట్టుకుని నూనేలో వేసుకుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని తరువాత పాకంలో వేసుకోవాలి.
అటుకుల ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే పాకంలో ఇలాచి వేసుకోవాలి
ఇది ఎంత రుచిగా ఉంటుంది అంటే తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది
ఇందులో అటుకులు వేసాం కాబట్టి పాకాన్ని కూడా త్వరగానే పీల్చుకుంటుంది

చారుపొడి

చారుపొడి....
చారుపొడి చాలా రకాలుగా చేస్తారు నేను కర్ణాటక లో నేర్చుకున్నా చాలా రుచిగా పిల్లలు కూడా ఇష్టపడతారు తెలియని వారికోసం
ధనియాలు - 2కప్స్
మెరపకాయలు - 20
మెంతులు - 3 స్పూన్స్
జీలకర్ర - 3 స్పూన్స్
మిరియాలు - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్ , ఇంగువ కొద్దిగా నూనే
మెరపకాయలు ఇంగువ కొద్దిగా నూనె లో వేయించుకోవాలి మిగిలినవి అన్నీ నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి చల్లారేక అన్నీ కలిపి మెత్తగా మిక్సీలో పొడి చేయాలి కర్వేపాకు కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు.

ఒక లీటరు నీళ్ళలో వుప్పు పసుపు చింతపండురసం, కర్వేపాకు ఒక స్పూన్ చారుపొడి వేసి బాగా మరగించి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ మెరపకాయ వేసి పోపు వేసి దింపేయండి


Tuesday, 28 November 2017

కందిపచ్చడి

కందిపచ్చడి.

రెసిపీ చాలా ఈజీ.

పది ఎండుమిరపకాయలు , కప్పు కందిపప్పు , అర స్పూను  జీలకర్ర  బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి , మరియు సరిపడా ఉప్పువేసి వాటిని రోటిలో వేసి ,తగినన్ని నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మెత్తగా  రుబ్బుకోవడమే .

చింతపండు , కరివేపాకు , పోపు  అన్నీ మీ ఇష్టమైన విధముగా  వేసుకోవచ్చును.

Monday, 27 November 2017

బెంగళూరు వంకాయ పచ్చడి

బెంగుళూరు  వంకాయ తో  పచ్చడి .

కావలసినవి .

బెంగుళూరు  వంకాయలు -- రెండు
పచ్చి మిరపకాయలు  --  8
కొత్తిమీర   --  ఒక  కట్ట
పసుపు  --కొద్దిగా
ఉప్పు --  తగినంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు.
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత . కొద్ది నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  8
మెంతులు --  పావు స్పూను
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా   బెంగుళూరు  వంకాయలు  కడిగి  చెక్కు  తీసి   ముక్కలుగా  తరుగు  కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   తరిగిన  వంకాయ  ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా  పసుపు , కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి  ముక్కలను  బాగా  మగ్గనిచ్చి  దింపి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు  , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు వేసి  పోపు  వేగగానే  దింపు కోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా   రోటిలో  ఎండుమిరపకాయలు  , చింతపండు  మరియు  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత బెంగుళూరు వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు  కూడా వేసి మరోసారి  మెత్తగా  బండతో నూరుకోవాలి .

చివరలో  మిగిలిన  పోపు  మరియు  కొత్తిమీర  వేసి   ఒకే ఒకసారి నూరుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే . ఎంతో  రుచిగా  ఉండే  బెంగుళూరు  వంకాయలతో  రోటి పచ్చడి సర్వింగ్  కు సిద్ధం. ఈ పచ్చడి  చపాతీలు , దోశెలు  మరియు  అన్నం లోకి  రుచిగా ఉంటుంది.

Thursday, 23 November 2017

వెజ్ రోల్స్

క్యాబేజ్ హాఫ్ ,
క్యారట్ 1,
బీన్స్ 6, (or ఉల్లి కాడలు)
క్యాప్సికమ్ 2 పెద్దవి,
ఆనియన్స్ పెద్దవి 2,
ఇవన్నీ సన్నగా పొడవు గా (3ఇంచులు) ఉండేలా క్యూట్ చేసుకోవాలి.....
అల్లం ,వెల్లుల్లి సన్నగా తరగాలి
3,4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్
రెడ్ చిల్లీ సాస్ , సోయా సాస్, (టొమాటో సాస్ ఇది ఛాయిస్ కొంచెం స్వీట్ అవుతుంది), వెనిగర్ అన్ని ఒక్కో స్పూన్
మిరియాల పొడి ఒక స్పూన్
సాల్ట్ తగినంత...
మూకుడు పెట్టుకొని 2స్పూన్స్ oil వేసి  అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.....ఉల్లి ముక్కలు కూడా వేసి కొంచెం వేగాక అన్ని కూర ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి, అన్ని సాస్ లు సాల్ట్ మిరియాల పొడి వెస్కొని కొద్ది సేపు కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.. కూర ముక్కలు ఉడికి పోకూడదు...కొంచెం పచ్చి గానే ఉండాలి...పైన కార్న్ ఫ్లోర్ చల్లి కలుపుకుంటే నీరు వచ్చిన ఫ్లోర్ తీసుకుంటుంది..చల్లారనివ్వాలి....
ఈలోగా..
కప్ మైదా, సగం కప్ కార్న్ ఫ్లోర్,ఉప్పు,  కొంచెం నిమ్మరసం, oil నీళ్ళు వేసి చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపు కొని మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి.
తరువాత ఉసిరికాయ అంత పిండి తీస్కొని పల్చగా వత్తుకోవాలి...వీలైనంత పల్చగా..
దాని మీద ఒక పక్కగా కూర పెట్టీ రెండు వైపులా మూసి చాపలా  కూర తో  సహా చుట్టుకొని ఇంకో చివర నీళ్ళ తో కొంచెం తడిపి అంటించేయాలి..అన్ని చేసుకొని కొంచెం తడి ఆరాక మీడియం మంట మీద మెల్లిగా వేయించాలి..తీసి paper మీద వేసుకుంటే నూనె పీల్చుకుంటుంది..👍👍👍👍

Tuesday, 21 November 2017

వరిపిండి చెకోడీలు

తయారు చేసే విధానం
చాలా సింపుల్
వరిపిండి ముందు ఉడకపెట్టాలి.
దాన్లో కి పచ్చిమిర్చి పేస్ట్ ఛాయ పెసరప్పప్పు
తగింతగా వేసి పిండిలో కలుపు కుని
మీకు ఇష్టమైన సేఫ్ లో చేసుకుని
నూనెలో వేపుకోవాలి
రొస్టుగా వేయిస్తే కర్ కర్ గా బాగుంటుంది.