Showing posts with label Courtesy : Kamala Sishtla. Show all posts
Showing posts with label Courtesy : Kamala Sishtla. Show all posts

Saturday, 2 March 2019

Maddur vada మద్దూర్ వడ

కొత్తగా ఏదైనా వండాలి అనిపించింది. త్వరగా అయ్యేది ‘ మద్దూర్ వడ’ గుర్తుకొచ్చింది.

తయారీ:
1/2 కప్పు బియ్యంపిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/4 కప్పు శనగపిండి , 2 చంచాల పచ్చిమిర్చితరుగు, 4 చంచాల కొతిమేర, 1 చంచా mirchi flakes, 1/2 కప్పు వుల్లితరుగు1 చంచా అల్లం తరుగు, 1/2 థనియా, 1/2 చంచా జీర powders, 6 చంచాల జీడిపప్పు ముక్కలు, 4 చంచాల వేడి నూనె, తగిన వుప్పు వేసి నీళ్ళు పోసి గట్టిగా ‘ పప్పుచక్కల ‘ పిండి మాదిరి క లుపు కోవాలి. చేతికి నూనె రాసుకొన చిన్న
వుండలుగా చేసి పెట్టు కోవాలి.

భాళ్ళీ వేడిచేసి తగిన నూనె వేసి నూనె కాగాక వుండలని
చక్కల మాదిరి plastic
Paper పై తట్టి నూనె లో వేసి వేయించి Golden  brown colourరాగానే తీసి tissue paper లో పెట్టు కోవాలి.  అన్ని వండిన తరువాత చక్కగా అందమైన tiffin plate లో పెట్టుకొని మాగాయతోనో, అల్లంపచ్చడితోనో తింటే.......ఆనందం....బ్రహ్మనందం.

Wednesday, 20 June 2018

ఖర్జూరం లడ్డూ (Dates and Nuts Laddoo)

మిత్రులందరికి శుభోదయం🙏
మా ఇంటి వంట ... programme లో ‘ Dates and nuts ladoo’ present చేస్తున్నాను.
Chef పేరు: సురేష్ శిష్టలా.( hobby: music composition
                               And పాకశాస్రం లో ప్రావీణ్యం
ఇక చూద్దామ వారి విన్యాసం:
కర్జూరాలు మరియు బాదం, పిస్త, వాల్నట్స్, జీడిపప్పు మరియు కిసిమిస్.
పై వాటినన్నింటిని దోరగా వేయించి లడ్డూలు తయారుచేసుకొని ఒక పొడి సీసాలో దాచుకొని రోజు కొకటి చొప్పున తినాలి. తినటం వలన రక్తహీనత దరిచేరదు. Good cholestral పెరగుతుంది. ఎంతో ఆరోగ్య దాయకమైన స్వీటు.

Sunday, 17 June 2018

కాజూ కత్లీ (Kaju katli)

కాజుకత్లీ:
జీడిపప్పు ఒక కప్పు మిక్సి లో పొడి చేయండి. ఒక కప్పు కి 4 చంచాలు తక్కువగా చక్కర తీగ పాకం పట్టండి. దానిలో ఒక చంచా నెయ్యివేయండి. ఇప్పుడు పాకంలో జీడి పప్పు పొడి వేసి తిప్పుతుంటే ముద్ద అవుతుంది. వెంటనే దానిని నేయి రాసిన చపాతీ పీట పై పోసి పైన చంచా తో నెయ్యి రాసి చపాతీ కర్ర తో నునుపు చేయండి. దానిపై చాకుతో దైమండు shape లో గాట్లు పెట్టి బాగా చల్లారాక  Dry glass box లో దాచండి. వారంవరకు రుచి గా వుంటాయి.

Sunday, 10 June 2018

పాల అరిసెలు (Pala Arisalu)

మిత్రులందరికి శుభోదయం🙏

మా ఇంటివంటకి స్వాగతం:
మీఇంట్లో మేము ‘పాల అరిసెలు ‘ చేసుకున్నాం. ‘
వీటిని చేయటం చాలా సులువు. అరిసె పాకం పట్టకుండానే అరిసెల రుచితో ఎంతో రుచిగా వున్నాయి. ఎలా తయారు చేయాలో క్రింద వ్రాస్తున్నాను. మీరుtry చేయవచ్చు .

పాల అరిసెల తయారి:
1/2 కిలో బియ్యం,
1/4  కిలో బెల్లం
1/2 కప్పు పాలు
చిటికెడు వుప్పు.
బియ్యం ముందురోజ నానపెట్టి మరునాడ పొద్దున వడేసి
5 నిమిషాలు ఆరనిచ్చి మిక్సిలో బియ్యపిండి తయారు చేసుకోవాలి.
బెల్లంతరిగి పాలల్లో వేసి బాగా కలిపి వడబోసుకోవాలి( బెల్లంలో ఇసుక వుంటే వడగట్టటానికి)
ఇప్పుడు దీనిలో బియ్యంపిండి వేసి కిలిపి, చిటికెడు వుప్పు కూడా , నువ్వులు కలిపి చిక్కగా గరిటజారుగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటలు పక్కన బెట్టి తరువాత అరిసెలు వండాలి.
ఒక భాళ్ళీ లోనూనె కాగాక మీడియమ్ సెగలో ఒక్కగరిట పిండిని నూనెలో పోయాలి. అది వేగి పైకి  తేలగానే రెండోవైపు కూడా వేగనిచ్చి తీయాలి. ఇలా  ఒకదాని తరువాత ఒకటి పిండి అయిపోయేవరకూ  చేయాలి.
అంతే రుచికరమైన పాల అరిసెలు రెడి.

Monday, 4 June 2018

Bread Utappam బ్రెడ్ ఊతప్పం

మిత్రులందరికి శుభోదయం🙏

ఈరోజు breakfast ‘ బ్రెడ్ ఊతప్పం’

Recipe:
6 bread pieces , 1/2 cup rice flour, 1/2 cup suji flour
1/2 cup పెరుగు.

2 చంచా కొతిమేర తరుగు, 2 చంచాల కారెట్ తురుము, 2 చంచా ఉల్లి ముక్కలు 1 పచ్చిమిరప తరుగు , టమాటా slices. 1/4 చంచ తినేసేడా, తగినంత వుప్పు.

మొదట bread అంచులు తీసివేసి మిక్సిలో పొడిచేయండి. Rice flour , suji rava లో పెరుగు వేసి తగిన వుప్పువేసి మిర్చి పేస్టు వేసీ ఇడ్లీ పిండి లాగా కలపండి. అందులో bread పొడి వేసి తగిన నీరు వేసి కొంచెం కొతిమేర తరుగు వేసి కలపండి.

ఇప్పుడు తావా వేడి చేసి నూనె చల్లి పిండి పరిచి దానిపై
మూతపెట్టి పిండి పైవైపు పచ్చి పొయిన తరువాత కారెట్ కొతిమేర , వుల్లిమిక్కలు టమాటా ముక్కలు పేర్చి మరలా మూత పెట్టి నూనె వేయాలి. 1 నిమిష మాగి ఉూతప్పం తీసి plate లో పెట్టుకోని వేడి వేడిగా తినాలి.

(Note:పైన వేసేకారెట్ వగైరాలు 1 నిమిషం oven లో వేడి చేసి చల్లాలి.)
పిండిలో జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా రుచి గా వుంటుంది.

Saturday, 2 June 2018

చిమ్మిరి (చలిమిడి)

చిమ్మిరి.
1  and 1/2 cup నువ్వులు
1 cup fresh తురిమిన ఎండు కొబ్బరి
1 cup స్వచ్చమైన బెల్లంపొడి
మొదట నువ్వులు కొబ్బరి కలిపి పొడి చేయండి ( మిక్సిలో)
ఇప్పుడు దానికి బెల్లంకలిపి మరోమారు పొడి చేసి Mixture ని plate లో వుంచి చేతితో వుండలు చేసుకోవాలి. వాటిని మరి కొన్ని నువ్వులలో పొర్లించి తీయాలి.
నల్ల నువ్వులతో రుచి ఎక్కువ.

Wednesday, 2 May 2018

పెసర పప్పు ఇడ్లీ (Moongdal Idli)

మితృలకి శుభోదయం.

ఈరోజు చాలా simple breakfast.  Moongdal idli. ఇది ఈ మధ్య బాగా popular అయింది. ఎందుకంటె pre. Diabetics and diabetice వున్నా వారికి ఆహారనియమాలవల్ల మామూలు ఇడ్లీ తినలేరు. పెసలు వుపయోగించ చేసే ఇడ్లీ తినవచ్చు. అదన్న మాట సంగతి .
రుచికి రుచి. ఇంకే మరి ‘ weight watchers’ కూడా నిరబ్యంతరంగాయతినచ్చు. Protein food కదా. సాంబారుతో అయినా సరే పల్చని పుట్నాలపప్పు కొబ్బరి కలిపి చేసిన చట్నీతో కాని మహా రుచిగా వున్నాయి. మిగిలితే ‘ మసాలా వేపుడు ఇడ్లీ’ లాగా చేసుకొని టీ టైలో తినేయొచ్చు.

తయారీ విధానం:
2 కప్పులు పచ్చ పెసలు, 1 కప్పు గుండు మినపప్పు
4 గంటలు నానపెట్టి కడిగి విడివిడిగా బరకగా రుబ్బి రెండిటిని కలిపి తగిన వుప్పు వేసి 3 గంటలు పక్కన పెట్టండి. తరువాత 1/2 చంచా వంటసోడ కలిపి ఇడ్లీలు వండు కోండి. ఇష్టమయిన చట్నీతో వేడి వేడి గా తినండి.
‘ఆరోగ్యమే మహా భాగ్యం’ 🙏

Wednesday, 18 April 2018

కూరలతో రసం (Vegetables Special Juice)

మితృలందరికి శుభోదయం🙏
యండాకాలం. అందరికి ఏవైన పళ్ళరసం చల్ల చల్లగా తాగాలన పించటం సహజం. మేము అలాగే తలచి కూరలు కాడా వేసి ఈ special juice చేసుకున్నాం.
ఇందులో బీట్రూట్, కారెట్, యాపిల్ మరియు టమోటా. ప్రతి juice glass కి లో 10 చుక్కల నిమ్మరసం,4 ఐసు ముక్కలు. అంతే. భలే వుంది. ఇది ఉదయం పూట తాగితే మంచిది. మెత్తని పిప్పి  ( roughage) తోసహా తాగడం శ్రేయస్కరం.

Tuesday, 17 April 2018

డబుల్ కా మీఠా

మితృలందరికి శుభోదయం🙏
ఆదివారం మద్యాహ్నం చేసిన స్వీటు. డబల్ కా మీటా ( హైదరాబాదీ వంటకం.) Hedersbad city లో చాలా popular sweet. US లో ‘Donut’ కి ఎంత craze వుందో డబల్ కా మీటా Hyderabad లో అంతే. అచ్చమైన తెలుగులో ‘ Bread Halwa.’ అంటారు.
        మీలో ఎంతమందికి ఇష్టంమరి?

డబల్ కా మీటా తయారీ:
4 white bread slices ( అంచులు తీసివేసి ముక్కలు చేయండి) నూనెలో కొంచెం నేయి వేసి , bread ముక్కలు golden brown వచ్చేవరకు వేయించి పక్కన పెట్టండి.
తరువాత 1 కప్పు  చిక్కని పాలు మరిగించి1/4 కోవా అందులో బాగా కలిపి వేయించిన bread ముక్కలని అందులో నాన బెట్టండి.

ఇప్పుడు 1cup చక్కర పాకంపట్టి ( one string ) ఇలాచి పొడి వేసి నానపెట్టిన bread mixture లో పోసి బాగా కలియతిప్పాలి. దానిలో వేయించిన జీడిపప్పు ముక్కలు, బాదం, కిస్ మిస్ వేసి కలపాలి. 2 గంటల తరువాత పాకం bread mixture లో కలిసి హల్వ లాగా తయారవుతుంది. దీనినే ‘ డబల్ కా మీటా’. అంటారు.దీని రుచి అమోఘం.👌

Saturday, 14 April 2018

క్యాలీఫ్లవర్ వేపుడు (Cauli flower fry)

Cauliflower ముక్కలు కడిగి తెర్లుతున్న నీళ్ళలో 2 నిమిషాలు వుంచి బయటకు తీయండి. 1/4 కప్పు బియ్యపిండిలో 1 పెద్దచంచా కారం , వుప్పు, ధనియాలపొడి , జీలకర్ర కలిపి ఈ mixture ముక్కలకి పట్టించి 2 పెద్ద చంచాల నూనె లో వేయించిన కోవాలి. వేగాక మరలా కొద్దిగా కారం చల్లి దింపుకోవాలి. Kashmiri chilli powder వాడండి.

Wednesday, 4 April 2018

మాగాయ (Magai)

మాగాయ పచ్చడి:
4 పుల్లని పచ్చి మామిడికాయలు (హస్తంసైజు)
120 గ్రాముల ఉప్పు
120 గ్రాముల కారం( 3 మాంగోస్)
2 table spoons వేయించిన మెంతిపిండి(మెంతులు సన్న సెగమీదవేయించి పొడి చేసుకోవలస)
1 table spoon ఆవపిండి
పచ్చళ్ళ ఇంగువ 2 శనగబద్దలం
చిటికెడు పసుపు
తయారీ:
మామిడికాయలు కడిగి తుడిచి తొక్కతీసి ముక్కలు పల్చగా పొడుగ్గా కోసి ఉప్పు పసుపు బాగా కలిపి జాడీలో వుంచాలి.
3 రోజు ముక్కలను నొక్కిబయటకు తీసి ఊట జాడీలోనే వుంచాలి. ఈముక్కలని 2 రోజులు, ఊటను 1 రోజు ఎండలో వుంచాలి. మరలా 3 రోజు కారం, మెంతిపిండి, ఆవపొడి సిధ్ధం చేసుకొని. ముక్కలను ఒక వెడల్పుబేసిన్  లోవేసి కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి కలిపి ఊటపోసి బాగా కలపాలి.
ఒకకప్పు నూనె కాచి ( పప్పు నూనె)ఆవాలు జీలకర్ర, ఇంగువ వేసి పోపు తయారు చేసి నూనె కొంచెం చల్లారాక  పచ్చడి మీదపోసి కలెదిప్పి 5 నిమిషాల తరువాత జాడీలో పెట్టు కోవాలి. తడి తగలరాదు. చిన్నరసాలు(పచ్చివి) ఈ పచ్చడికి బాగుంటాయి.కారం మంచి ఎరుపు రంగుది ఎంచుకోవాలి.
మీరు చేసాక నాకు ఎలావుందో చెప్పండి.

Tuesday, 3 April 2018

బెండకాయ మజ్జిగ పులుసు

బెండకాయ మజ్జిగ పులుసు:
3 కాయలు per head
2cup మజ్జిగ per head
కొతిమేర, 1చంచాలు శనగపిండి,1 చంచా బియ్యపిండి, 1/2 gingerpaste, 1/2 చంచా మిర్చిపేస్టు, ఉప్పు.,1/2 చంచా ధనియాలపొడి.
ముందుగా బెండకాయలు గెణుపు పొడుగున cut చేసి వాటిలో పలచని మజ్జిగపోసి వుండికించుకోవాలి. ముక్క చితకరాదు.
ఒకచిన్న  కొబ్బరిముక్క paste చేసి పెట్టుకోవాలి.
ఒకగిన్నెలో మజ్జిగపోసి పైన చెప్పిన పదార్దాలు వేసి ( బెండముక్కలు తప్ప) బాగా కలియబెట్టి, ఒక  భాళ్ళీలో నేతి పోపు చేసి మజ్జిగ మిశ్రమం పోయాలి. మజ్జిగపొంగురాంగానే మంట సన్నగా వుంచి గరిటతతో కలియబెట్టి తగిన వుప్పు వేసి, వుడికించిన బెండముక్కలు వేసి 1 నిమిషంఆగి మంట తీసేయాలి.

Thursday, 15 March 2018

జీడిపప్పు బిళ్లలు (Kaju kathli)

మితృలందరికి శుభోదయం 🙏

మా ‘వంటింటి కబుర్లకి ‘ స్వాగతం:
మా వంటింట్లో తయారయిన పసందైన తీపి వంటకం ‘ జీడిపప్పు బిళ్ళలు’.   అదేనండి అందరూ ‘ కాజూ కత్లీ’ అంటూవుంటారు. అదేమరి . మన తెలుగులో చెప్పానంతే.

3 కప్పుల జీడిపప్పు పొడికి 2 కప్పుల పంచదార పడుతుంది. 3 పెద్ద చెంచాల నెయ్యి పడుతుంది. ముందుగా  2 baking sheets  రెడీగా  పెట్టుకోవాలి (విస్తరి సైజు)
ఒక nonstick pan లో 2 కప్పుల చక్కర వేసి just చక్కర తడిసేట్ట్లుగా నీరు పోసి పాకం పట్టాలి. One string పాకంరాగానే కొద్ది కొద్దిగా కాజూ పొడి వేస్తూ పాకం కలియబెట్టి అంతా పొడి వేసాక ఓ చంచా నెయ్యి,ఏలకులు పొడి వేసి కలపండి మరల ఓ చంచా నేయి వేసి కలియబెట్టడి. నెయ్యి అంచువీడి పాకంమొత్తదగ్గరపడి వుండలాగా  అవుతుంది. అప్పుడు మంట ఆపేసి ఆ పాకాన్ని పరిచిన baking sheet మీద పోయండి. దానిపై నెయ్యి ఓచంచావేసి అంతట రాసి పైన baking sheet కప్పి అప్పడాలకర్రతో  చదును చేయండి. తర్వాత పేపరు  తీసేసి పాకం sheet ని flat plate లో వుంచి ప్రిజ్ లో 15 నిమిషాలు వుంచితే గట్టి పడుతుంది. తరువాత బయటకు తీసి చాకుతో diamond shape లో ముక్కలు కోసి dry jar లో పెట్టుకోవాలి. మొత్తం 30 నిమిషాలలో తయారవుతుంది.

ఇంతకీ మా sweet ఎలా వుందంటారూ.......

Wednesday, 14 February 2018

ఆవిరి కుడుములు

మితృలందరికి శుభోదయం 🙏

మా వంటింట కబుర్లు:
పొట్టు మినపప్పు తో చేసుకున్న  ‘ఆవిరి కుడుము’.
ఇది కొంచెం ‘special’.  ఎందుకంటే దీనిలో  నేతిలో వేయించిన మిరయాలు వేసా.  పైన నిమ్మరసం లో నానబెట్టిన పచ్చిమిర్చి ముక్కలు  , కొన్ని carrotslices, కొన్ని వేయించిన మిరియాలు   జల్లాను.  ఇంకా ఆవిరి కుడుము లోకి  చవులూరించే కొతిమేర ఖారం.

మరి మీకు ఎలా అనిపిస్తోంది.

Tuesday, 6 February 2018

దిబ్బరొట్టె (సబ్జీకా హాండ్వో)

మిత్రులందరికి శుభోదయం 🙏
ఈ రోజు మా వంటింటి కబుర్లు . Healthy, tasty, dal and vegetable ‘దిబ్బరొట్టె. పేరు ‘సబ్జీకా హాండ్వో’. ( vegitablle Handvo)
ఇందులో శనగపప్పు , పెసరపప్పు , మినపప్పు , , boiled rice,కొన్ని కూరల తరుగు, పచ్చిమిరప, అల్లం, కొతిమేర , నువ్వులు వగైరా. ఆరోగ్యానికి కావలిసిన వన్నీ పడ్డాయి. మళ్ళా కూర తినలేదనే చింత లేదు. వంట చేయటానిక ఓపిక లేనప్పుడు ఈ వంటకం అద్భుతంగా వుంటుంది.  నేను ఈరోజు మాఇంట్లో చేసాను. ఎలావుంది మరి? మీరు కూడా try చేస్తారు కదూ.
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

సబ్జీకా హండ్వొ. ( vegitable Handvo)
కూరలతో దిబ్బరొట్టె:
తయారీ విధానం ( by Kamala Sistla)
కావలసిన పదార్దాలు:
మినపప్పు:   1/2 కప్పు
శనగపప్పు:    1/2 కప్పు
పెసరపప్పు:    1/2 కప్పు
Boiled rice:   1/2 కప్పు
లేక మామూలు rice
కూరలు: పాలకూర, కారెట్,బంగళదుంప,సొరకాయ
ఈ కూరల తరుగు(తురుము) ప్రతిది పావు కప్పు
ఉల్లిపాయముక్కలు 1/4 కప్పు పచ్చిమిరప ముక్కలు 2 చంచాలు అల్లం ముక్కలు 1 చంచా వెల్లుల్లి కవాలంటె 1 రెబ్బముక్కలు కొతిమేర తరుగు 4 చంచాలు, తగిన వుప్పు,  నువ్వులు 4 చంచాలు, 1/4 చక్కర, 1 చంచా ఆవాలు1 చంచా జీలకర్ర
కర్వేపాకు. 2 చంచాల పెరుగు

తయారీ: మినపప్పు, శనగపప్పు , పెసరపప్పు , boiled rice or rice పైన చెప్పిన కొలతల ప్రకారం 5 గంటలు నాన బెట్టి నీళ్ళు వంపి ఒకసారి కడిగి తీసి ఇడ్లీ పిండి మాదిరి రుబ్బుకొని  రాత్రంతా మూతపెట్టి వుంచాలి. పొద్దునకు చక్కగా పొంగుతుంది. దానికి తగిన వుప్పువేసి 2 చిటికలు పసుపు కలిపి పక్కన పెట్టండి. తురుము పీటతో పైన చెప్పిన కూరగాయలు తురమండి. నేచెప్పిన కొలత ప్రకారం పిండిలో వేయండి.వుల్లి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు , కొతిమేర తరుగు పిండి లో వేయండి. 2 చంచాల తెల్ల నువ్వులు వేయండి. 2 చంచాల పెరుగు వేయండి. వీటన్నిటినిపిండిలో బాగా కలియ బెట్టి 2 నిమిషాలు ఆగండి.
మందపాటి nonstick కడాయిని వేడిచేసి 2 చంచాల నూనెవేసి ఆవాలు , జీలకర్ర, చిట్లించి, నువ్వులు , కర్వాపాకు వేగంగానే రెడీ చేసుకున ప్ండిని ఒకటిన్నర అంగుళాలమందాన పిండి వేసి మూత పేట్టండి.( 3 లేక 4 గరిటెల పిండి) మీడియం మరియు సన్నని సెగమీద పెట్టే వుడకనివ్వండి. అడుగు ఎర్రబడంగానే లేపి పక్కనబెట్టి మరల1 చంచా నూనెవేసి 1 చంచా నూవులు వేగనచ్చి రొట్టెరెండోవైపు వేసి కాలనివ్వండి. అప్పుడు Picture లో మాదిరి కూరల రొట్టె తయారు అవుతుంది.
      🍽శుభం🍽

Monday, 5 February 2018

స్టఫ్డ్ ఇడ్లీ (కూర కూరిన ఇడ్లీలు)

మితృలందరికి శుభోదయం🙏
‘మా ఇంటి వంట’ కార్య క్రమంలో భాగంగా ఈ రోజు ‘stuffed Idli’ అనగ ‘కూర కూరిన ఇడ్డెన్లు.’ అన్న మాట.
ఇది ఇల్లాలు పని ని కాస్త సులువు చేస్తుంది. Friz లో దాచుకు్న్న కాబేజీ కూర నుంచి అప్పుడి కప్పుడు చేసినమసాల కూర  దాకా .... ఏదైనా కూరి  ఇడ్డెనులు చేసుకొన హాయిగా తినచ్చు. సాంబార్లు, చట్నీలతో పని లేదు. కరివేపాకు ఖారం మాత్రం వుండాలండోయ్.
వేడి వేడి గా తింటే ఆరుచే వేరప్పా....
మరైతే ఆలస్యం ఎందుకు రేపు చేసేద్దాం.

తయారీ విధానం:
ఇడ్లీ పిండి తయారు చేసుకోవటమ అందరికి తెలుసు కాబట్టి దాని జోలి వెళ్ళటంలేదు.
ఇడ్లీ వేసుకొనే విధానం: ( by Sistla Kamala)

కూరని round గా బిళ్లలు తట్టుకుని రెడి గా పెట్టుకోండి.
ఇడ్లీ plate కినూనెరాసి 1 spoon ఇడ్లీ పిండి వేసి దాని మీద కూర బిళ్ళని వుంచి దానిపై మరలా ఇడ్లీ పిండి వేసి   అన్ని plates నిండాక ఆవిరి మీద 15 నిముషాలు వుడికించి దించి 2 నిమిషాలు ఆగి ఇడ్డెనలు తీయాలి .

కూరలు రకాలు:

కారట్ తురుము frozen green peas, salt, మిర్చి paste, chatmasala ...1 type
Cabbage curry plus potato....2 type
Potato curry. .....3 type
Smashed pakora....4 type
Tomato ketchup with peas...4 type
Smashed paneer curry.....5 type
And so on as per your taste.
Cook ,eat and share with us
Happy ‘Stuffed Idly day ‘friends.👍

Saturday, 3 February 2018

బైంగన్ బర్తా (కాల్చిన వంకాయ కూర)

మితృలందరికి శుభోదయం 🌻
మా వంటింటి ఘుమ ఘమలు  ( వంకాయ వారోత్సవం)
1. బైంగన్ బర్తా (  కాల్చిన వంకాయతో కూర) ( Punjabi dish)
2.  వంకాయ వేపుడు ఖారం (నింపుడు వంకాయ)
3.  వంకాయ కాల్చి జీలకర్ర ఖారంతో పచ్చడి.

😀వంకాయ fans అందరికి ఈ post అంకితం😀
బైగన్  బర్తా వంటకం:🍆🍆🍆
( by Kamala sistla)
Baigan bharatha curry
కావలసినది: 1 పెద్ద బుంగ వంకాయ
2.  1 ఉల్లిపాయ
3.   4 నిమ్మకాయ సైజు టమాటాలు
4.   2 చంచాల  కొతిమేర తరుగు
5.    1 చంచా ధనియాల పొడి
6.    1/2 చంచా జీలకర్రపొడి
7.      3చంచాల నూనె
8.     1 చంచా అల్లం వెల్లుల్లి పేస్టు
9.      తగిన వుప్పు, కారం
మొదటిగా వంకాయ కి నూనె రాసి gas మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చండి. మొత్తం తొక్కు నలుపు గా అవుతుంది. కొంచెంచల్లారాక చేయి తడి చేసుకుని తొక్కు వలచి లోపలి గుజ్జు చాకుతో  కోసి ముక్కలు గిన్నెలో పెట్టుకోండి.
ఇప్పుడు ఉల్లిముక్కలు, టమోటా ముక్కలు అల్లంవెల్లుల్లి పేస్టు రెడి చేసుకొండి.
ఒక కడాయి వేడి చేసి నూనె వేసి నూనె కాగంగానే 1/2 చంచా జీలకర్ర వేసి  వుల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించి పచ్చి వాసన పోగాన టమేటా ముక్కలు వేసి మగ్గ నియ్యండి. తగిన వుప్పు, కారం వేయండి . టమేటా ముక్కలు మగ్గంగానే వంకాయ గుజ్జు వేసి కలియ తిప్పండి. ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి సన్నని సెగలో 5 నిమిషాలు వుంచండి. ఒకసారి కలియతిప్పి వుప్పు కారం సరిచూసి కొతిమేర తరుగు వేసి కూర దించి serving bowl లో పెట్టుకోండి.
కొతిమేర తరుగు కు బదులువెల్లులి కాడల తరుగు కూడా వేయవచ్చు.
కాల్చినవంకాయ  కుండే flavor వల్ల కూర చాలా special గా వుంటుంది.
North లో ఈ కూరలో పచ్చిభఠానీలు కూడా వేసుకుంటారు.
                         🍆🍆🍆

Wednesday, 31 January 2018

డోక్లా

మితృలందరికి శుభోదయం. 🙏
ఈరోజు మా ఇంట్లో ‘ డోక్లా’ చేసుకున్నామోచ్.
సామాన్యంగా Basan ki dhokla చేస్తుంటారు.
అంటే శనగపిండి తో చేస్తారు. అలాగే బొంబాయి రవ్వతో కూడా చేస్తారు. Moongdal ( పెసరపప్పుతో) తో చేస్తారు.
పప్పులు నాన బెట్టి రుబ్బి చేస్తారు. రెండోరకం పిండి తో చేస్తారు.

నేను పొట్టు మినపప్పు నానబెట్టి రుబ్బి చేసాను. ఆవిరి మీద వండి తిరగమాత ఎసరుతో  తయారవుతుంది.ఎవరికైన తయారీ పద్దతి కావాలంటె post  పెడతాను.

రుచి: పుల్ల పుల్లగా తియ్యతియ్యగా ఖారంఖారంగా కొతిమేర వాసనతో కొబ్బరి నాలికకి తగులుతూకమ్మటిమినప రుచితో వుంటుంది.

మీకు నచ్చిందా మరి?

మినప ఢోక్లాకయారీ:
( by Sistla Kamala)
1 cup మినపప్పు మధ్యాహ్నం నానబెట్టి రాత్రి చెంచా మరమరాలు గాని అటుకులు గాని వేసి గట్టిగ రుబ్బి మూతపెట్టండి. పొద్దునే దానిలో ఓ చిటికెడు పసుపు 2 పెద్దచంచాల బోలు శనగపప్పు బరక పిండి 3 పెద్దచంచాల అతిసన్నని ఇడ్డీరవ్వ లేక బరక బియ్యం పిండి కలిపి తగిన వుప్పు చేర్చి ఇడ్లీ పిండి మాదిర కలపాలి. ఇందులో అరచంచా ‘ఈనోసాల్టు ‘ వేసి దానిపై 1/4 చంచ నిమ్మరసం వేయాలి. ఈనో సాల్టు బుసబుస పొంగాక గరిటెతో కలియ తిప్పండి. ముందుగా నూనెరాసి పెట్టుకున్న. కుక్కరు గిన్నెలో ఈ పిండి పోసి కుక్కరు లో పెట్టి 15 నమిషాలు weight  పెట్టకుండావుడకనీయండి.2నిమిషాల తరువాత
తరువాత తీసి ఓ కంచంలోకి బోళ్ళించండి.  చాకుతో గాట్లు పెట్టండి.
ఒక తావాలో నేనె వేసి ఆవాలు జీలకర్ర చిట్లించి సన్నని మిరప ముక్కలు(2 కాయలు) కొతిమేర తరుగు వేసి పావు లీటరు నీరు పోయండి. తెరలిన తరువాత తగిన వుప్పు 1 spoon చక్కర 1 spoon నిమ్మరసంవేసి  ఆ వేడి నీటిని ఆవిరికుడుము ముక్కల పై spoon తో పోయండి. 2 , 3 ధపాలుగా పోయాలి.చాకుతో అడుగు భాగంలేపితే నీరు అడుగు భాగంకూడా పీల్చుకొని ఢోక్లా రుచిగా వుంటుంది. నీరు పోసాక 10 నిమిషాలకు ఢోక్లాలు తినవచ్చు. పైన పచ్చి కొబ్బరితో garnish చేసుకోవాలి. ఇష్టమయినవారు బాదామి
లేక జీడిపప్పు ముక్కలని జల్లుకోవచ్చు.

Friday, 1 December 2017

పచ్చి మిరపకాయల పచ్చడి, దోసకాయ మెంతి కారం

మిర్చి 1/2 చంచా నూనె లో వేయించి చల్లార్చి వుప్పు వేసి రుబ్బి నిమ్మరసంపిడాలి. (10 పచ్చి మిరపకాయలకు 1 నిమ్మకాయ రసం పడుతుంది. మిరపకాయలు కారం లేనివి వాడాలి) 1 గరిటడు నూనెలో పోపు 1 చంచామినపప్పు, 1 చంచా శనగపప్పు 1/2 చంచా ఆవాలు1/2 చంచ జీలకఱ్ఱ , చంచా పచ్చి మెంతిపిండ, ఇంగువ వేసి వేయించి పచ్చడిని పోపు లో వేయాలి. చల్లారాక పొడిసీసా లో వుంచాలి.

దోసకాయ మెంతికారం:
1 గట్టి దోసకాయ సన్న ను ముక్కలు గా కోయండి.మెంతులు1 పెదచంచా ఆవాల 2 TVs వేయించ పొడి చేయండి.1/4 cup red mirchi powder కంచెంతక్కవగా వుప్పు  తీసుకొని (4 రకాలు)ముక్కలలో కలపండి. ఒక కప్పు నూనె వేసి బాగాలకు జాడీ లో వుంచండ. పక్కరోజు కలియతిప్పి తినండి

Thursday, 30 November 2017

పాఠోళి

ఇది తెలుగు వాళ్ళదే. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది.
Authentic version: కందిపప్పు నానబెట్టి సరిపడ ఎండుమిర్చి , ఇంగువ, జీలకఱ్ఱ, వుప్పు వేసి కచ్త్చపచ్చ రుబ్బి నూనెబాగా వేసి రుబ్బిన పిండిని వాయలు వాయలు గా బంగారు రంగు వచ్చి కరకర వాడు వరకు వేయిస్తారు. అన్నంలో ఆధరువుగా తింటారు.
Kamala’ recipe ( పాఠోలీ)
రుబ్బటం వరకు పై విధంగానే.
తరువాత పిండిని కుక్కర్ గిన్నె( నూనె రాసిన) లోఆవిరిమీద వుడికించి
చల్లారాక చిదిపి నూనె బాగా వేసి పోపు చేసి ( కరివేపాకు పచ్చిమిర్చిముక్కలు, వుల్లి ముక్కలు కూడా వేసి) చదివిన పప్పును బాగా వేయించాలి. ఇది పలహారంలాగా కూడా తినవచ్చు.