Wednesday 27 June 2018

కొత్తిమీర పచ్చడి

కొంచెం  వెరైటీగా పచ్చిమిర్చి  కొత్తిమీర  పచ్చడి .

తయారీ విధానము.

చిన్నవి అయితే రెండు కట్టలు , పెద్దది  ఒక  కట్ట కొత్తిమీర  శుభ్రం చేసుకుని  వలుచుకుని  ఉంచుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు  పదిహేను నిముషాల  ముందు  కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టకుని  అర గ్లాసు రసం చిక్కగా  తీసుకోవాలి .

ఒక  15  పచ్చిమిరపకాయలు  తొడిమలు  తీసుకుని  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె  వేసి  స్పూను  చాయమినపప్పు , పావు స్పూను  మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ వేసి పోపు వేగగానే  పోపులో పచ్చిమిరపకాయలు  , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు మరియు  చింతపండు  రసం  వేసి మూత పెట్టి  అయిదు నిముషాలు  చింతపండు  రసంలో పచ్చిమిరపకాయలు  మగ్గనివ్వాలి .

తర్వాత  కొత్తిమీర  కూడా  పోపులో వేసి మూడు నిముషాలు  వేసి  మగ్గనిచ్చి  దింపుకోవాలి .

చల్లారగానే  ఈ మిశ్రమము మొత్తము  రోటిలో  వేసి పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి .

ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .

ఈ పచ్చడి  ఇడ్లీ , దోశెలు, గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా చాలా రుచిగా  ఉంటుంది .

Wednesday 20 June 2018

ఖర్జూరం లడ్డూ (Dates and Nuts Laddoo)

మిత్రులందరికి శుభోదయం🙏
మా ఇంటి వంట ... programme లో ‘ Dates and nuts ladoo’ present చేస్తున్నాను.
Chef పేరు: సురేష్ శిష్టలా.( hobby: music composition
                               And పాకశాస్రం లో ప్రావీణ్యం
ఇక చూద్దామ వారి విన్యాసం:
కర్జూరాలు మరియు బాదం, పిస్త, వాల్నట్స్, జీడిపప్పు మరియు కిసిమిస్.
పై వాటినన్నింటిని దోరగా వేయించి లడ్డూలు తయారుచేసుకొని ఒక పొడి సీసాలో దాచుకొని రోజు కొకటి చొప్పున తినాలి. తినటం వలన రక్తహీనత దరిచేరదు. Good cholestral పెరగుతుంది. ఎంతో ఆరోగ్య దాయకమైన స్వీటు.

మైసూర్ పాక్ (Mysore pak)

మైసూర్ పాక్

* రెండు కప్పు చక్కర్లో పావు కప్పు నీరు పోసి వేడి చేయ్యాల
* ఈలోపు ఇంకో పొయ్యిమీద ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు సన్ఫ్లవర్ నూనె వేసి వేడి చేయ్యాల
* చక్కర కరిగిన తర్వాత ఒక కప్పు సెనగ పిండి వేసి ఉండలు లేకుండ కలపాల
* కలుపుతూ కలుపుతూ వేడి నెయ్యి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగ వేస్తూ కలుపుతూ ఉండాల
* సన్నమంటపైనే చేయ్యాల
* నూనె వెయ్యడం అయిపోయేలోపు  మైసూర పాక్ పొంగినూనె బయటికి వదులుతుంది
* ఇప్పుడు ప్లేట్లో వేసి వడిగ ఉన్నప్పుడు ముక్కలు కట్ చేయ్యాల
* ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచితే గట్టిగ అయి పనికిరాకుండా అవుతుంది
* కొంచం తొందరగ తీస్తే చింతలేదు సాఫ్ట్ సాఫ్ట్ గ ‘మైసూర్పా’ తయారవుతుంది

పంజాబీ కడీ పకోడీ (Punjabi kadi pakodi)

• పంజాబీ కడీ పకోడీ

కావలసినవి: శెనగపిండి- 120 గ్రాములు, వాము, పసుపు, కారం, మెంతులు, ధనియాలపొడి, సోంపు- అరటీస్పూను, పెరుగు- 150 గ్రాములు, ఉల్లిగడ్డ(సన్నగా తరిగి)- సగం, కొత్తిమీర తరుగు, జీలకర్ర- ఒకటీస్పూను చొప్పున, ఎండుమిరపకాయలు- ఆరు, ఆవనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు- ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు- మూడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.

తయారీ: ఒక గిన్నెలో పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్లు, శెనగపిండి సగం, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకొని ఇరవై నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి మూడు, సోంపు, ధనియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేగించాలి. దీనిలో శెనగపిండి,పెరుగు మిశ్రమం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. వేరొక గిన్నెలో మిగిలిన శెనగపిండి, వాము, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా వత్తుకొని నూనెలో కాల్చాలి. వీటిని శెనగపిండి పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్‌ కడీ పకోడీ రెడీ.

శుభోదయం అందరికీ.

Sunday 17 June 2018

కాజూ కత్లీ (Kaju katli)

కాజుకత్లీ:
జీడిపప్పు ఒక కప్పు మిక్సి లో పొడి చేయండి. ఒక కప్పు కి 4 చంచాలు తక్కువగా చక్కర తీగ పాకం పట్టండి. దానిలో ఒక చంచా నెయ్యివేయండి. ఇప్పుడు పాకంలో జీడి పప్పు పొడి వేసి తిప్పుతుంటే ముద్ద అవుతుంది. వెంటనే దానిని నేయి రాసిన చపాతీ పీట పై పోసి పైన చంచా తో నెయ్యి రాసి చపాతీ కర్ర తో నునుపు చేయండి. దానిపై చాకుతో దైమండు shape లో గాట్లు పెట్టి బాగా చల్లారాక  Dry glass box లో దాచండి. వారంవరకు రుచి గా వుంటాయి.

Saturday 16 June 2018

బూడిద గుమ్మడి బరడా

• బూడిదగుమ్మడి బరడా

* కావాల్సినవి: బూడిదగుమ్మడి ముక్కలు- అరకిలో, పెసరపప్పు- 100గ్రా, సెనగపప్పు- 100గ్రా, జీలకర్ర- చెంచా, ఇంగువ- కొద్దిగా, నిమ్మకాయలు- రెండు, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు, కారం, పసుపు- తగినంత, ధనియాలపొడి- పావుచెంచా

* తయారీ: ముందుగా గుమ్మడికాయ ముక్కలని ఓ మోస్తరుగా పరిమాణంలో ఉండేటట్టు తరగాలి. పెసరపప్పు, సెనగపప్పు, ఇంగువ వీటిని బరకగా మిక్సీలో వేసి ఆడించుకోవాలి. ఈ రవ్వనే బరడా అంటారు. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి అందులో గుమ్మడిముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడివేసి ముక్క ఉడికేంత వరకూ ఉంచాలి. ఇందాక మనం ఆడించిపెట్టుకున్న బరడాలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి కూరలో కలుపుకోవాలి. ఇలా పదినిమిషాల పాటు ఉడికించిన తర్వాత రెండు నిమ్మకాయల రసం పిండుకుని పొయ్యి కట్టేస్తే బరడా సిద్ధం.

Wednesday 13 June 2018

బనానా కేక్ (Eggless Banana Cake)

Good morning friends..

Cake అనగానే మనకు మైదా పిండి గుర్తుకు వస్తుంది.. కానీ మైదా అసలు ఆరోగ్యానికి మంచిది కాదు.. అలాగని కేక్ తినటం మానేయక్కరలేదు..

**EGGLESS **

Recipe( తయారీ విధానం) :

కావాల్సిన పదార్థాలు:
1 & 1/2 cup గోధుమ పిండి
4 లేదా 5 బాగా మగ్గిన అరటిపండ్ల గుజ్జు
3/4th cup oil
3/4th cup sugar
1 tea spoon baking powder
1/2 tea spoon baking soda
1 table spoon vanilla extract or powder
Handful of walnuts
Pinch of salt

ముందుగా గోధుమపిండి, బేకింగ్ పౌడర్, baking సోడా, salt
తీసుకుని జల్లించి పెట్టుకోండి.

ఇప్పుడు ఒక bowl లో అరటిపండ్ల గుజ్జు , ఆయిల్, sugar వేసి బాగా కలపాలి. Vanilla extract కూడా వేసి బాగా కలపాలి.

ఇప్పుడు గోధుమపిండి మిశ్రమాన్ని( dry ingredients) అరటిపండ్ల మిశ్రమంలో (wet ingredients) వేసి గరిట తో fold చెయ్యండి.. ఎక్కువగా కలపకూడదు. ఇందులో walnut's వేసి ఒక్కసారి మళ్ళీ కలపండి..

Oven ను ముందుగా 180 degrees వద్ద pre heat చేసి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు.

ఇప్పుడు మొత్తం cake మిశ్రమాన్ని grease చేసిన బేకింగ్ tray లో వేసి పైన మీకు నచ్చిన డ్రై fruits వేసుకోవాలి.

ఈ trayను oven లో పెట్టి 180 degree లో 30 - 40 minutes bake చెయ్యాలి. తరువాత ఒవేన్ open chesi ఒక tooth pick తో గుచ్చి చూస్తే కేక్ అంటుకోకుండా ఉండాలి. అప్పుడు cake రెడి అయినట్లే..

* cooker లో చేసుకునే విధానం మరి నాకు తెలియదు. క్షమించాలి *

గోధుమపిండి తో చేసిన healthy and tasty  banana walnut cake.. no artificial flavors..

నేను ఎప్పుడూ అన్ని cakes, cookies గోధుమపిండి తో నే చేస్తాను.

ఎలా ఉందో చూసి చెప్పండి..

Sunday 10 June 2018

పాల అరిసెలు (Pala Arisalu)

మిత్రులందరికి శుభోదయం🙏

మా ఇంటివంటకి స్వాగతం:
మీఇంట్లో మేము ‘పాల అరిసెలు ‘ చేసుకున్నాం. ‘
వీటిని చేయటం చాలా సులువు. అరిసె పాకం పట్టకుండానే అరిసెల రుచితో ఎంతో రుచిగా వున్నాయి. ఎలా తయారు చేయాలో క్రింద వ్రాస్తున్నాను. మీరుtry చేయవచ్చు .

పాల అరిసెల తయారి:
1/2 కిలో బియ్యం,
1/4  కిలో బెల్లం
1/2 కప్పు పాలు
చిటికెడు వుప్పు.
బియ్యం ముందురోజ నానపెట్టి మరునాడ పొద్దున వడేసి
5 నిమిషాలు ఆరనిచ్చి మిక్సిలో బియ్యపిండి తయారు చేసుకోవాలి.
బెల్లంతరిగి పాలల్లో వేసి బాగా కలిపి వడబోసుకోవాలి( బెల్లంలో ఇసుక వుంటే వడగట్టటానికి)
ఇప్పుడు దీనిలో బియ్యంపిండి వేసి కిలిపి, చిటికెడు వుప్పు కూడా , నువ్వులు కలిపి చిక్కగా గరిటజారుగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటలు పక్కన బెట్టి తరువాత అరిసెలు వండాలి.
ఒక భాళ్ళీ లోనూనె కాగాక మీడియమ్ సెగలో ఒక్కగరిట పిండిని నూనెలో పోయాలి. అది వేగి పైకి  తేలగానే రెండోవైపు కూడా వేగనిచ్చి తీయాలి. ఇలా  ఒకదాని తరువాత ఒకటి పిండి అయిపోయేవరకూ  చేయాలి.
అంతే రుచికరమైన పాల అరిసెలు రెడి.

Saturday 9 June 2018

కారప్పొడి

కారప్పొడి తయారీ విధానం

మినప్పప్పు1/4 కిలో,ఆవాలు 1/2 స్పూను,ధనియాలు 2 చెంచాలు,జీలకఱ్ఱ1స్పూను,కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి 20, కర్వేపాకు 2 రెబ్బలు
పొయ్యి మీద మూకుడు పెట్టి 1 స్పూను నూనె వేసి ఆవాలు,జీలకఱ్ఱ,ధనియాలు,ఎండుమిర్చి,కర్వేపాకు,చింతపండు వేయించాలి.
వేరుగా మినప్పప్పు నూనె లేకుండా వేయించాలి.
అన్నీ చల్లారనిచ్చి సరిపడ ఉప్పు,ఇంగువ 1/2 స్పూను వేసి మిక్సీ చేసుకోవాలి.ఈ పొడి ఇడ్లీ లోకి చాలా బాగుంటుంది.

Monday 4 June 2018

Bread Utappam బ్రెడ్ ఊతప్పం

మిత్రులందరికి శుభోదయం🙏

ఈరోజు breakfast ‘ బ్రెడ్ ఊతప్పం’

Recipe:
6 bread pieces , 1/2 cup rice flour, 1/2 cup suji flour
1/2 cup పెరుగు.

2 చంచా కొతిమేర తరుగు, 2 చంచాల కారెట్ తురుము, 2 చంచా ఉల్లి ముక్కలు 1 పచ్చిమిరప తరుగు , టమాటా slices. 1/4 చంచ తినేసేడా, తగినంత వుప్పు.

మొదట bread అంచులు తీసివేసి మిక్సిలో పొడిచేయండి. Rice flour , suji rava లో పెరుగు వేసి తగిన వుప్పువేసి మిర్చి పేస్టు వేసీ ఇడ్లీ పిండి లాగా కలపండి. అందులో bread పొడి వేసి తగిన నీరు వేసి కొంచెం కొతిమేర తరుగు వేసి కలపండి.

ఇప్పుడు తావా వేడి చేసి నూనె చల్లి పిండి పరిచి దానిపై
మూతపెట్టి పిండి పైవైపు పచ్చి పొయిన తరువాత కారెట్ కొతిమేర , వుల్లిమిక్కలు టమాటా ముక్కలు పేర్చి మరలా మూత పెట్టి నూనె వేయాలి. 1 నిమిష మాగి ఉూతప్పం తీసి plate లో పెట్టుకోని వేడి వేడిగా తినాలి.

(Note:పైన వేసేకారెట్ వగైరాలు 1 నిమిషం oven లో వేడి చేసి చల్లాలి.)
పిండిలో జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా రుచి గా వుంటుంది.

Saturday 2 June 2018

చిమ్మిరి (చలిమిడి)

చిమ్మిరి.
1  and 1/2 cup నువ్వులు
1 cup fresh తురిమిన ఎండు కొబ్బరి
1 cup స్వచ్చమైన బెల్లంపొడి
మొదట నువ్వులు కొబ్బరి కలిపి పొడి చేయండి ( మిక్సిలో)
ఇప్పుడు దానికి బెల్లంకలిపి మరోమారు పొడి చేసి Mixture ని plate లో వుంచి చేతితో వుండలు చేసుకోవాలి. వాటిని మరి కొన్ని నువ్వులలో పొర్లించి తీయాలి.
నల్ల నువ్వులతో రుచి ఎక్కువ.