ట్రంప్ విందుకు జగన్ కి ఆహ్వానం దేనికి లేదు, మనమేం కోల్పోయామో అర్ధం అవుతుందా? జగన్ కి ఆహ్వానం దేనికి లేదు, మనమేం కోల్పోయామో అర్ధం అవుతుందా అంటూ మోహన్ రావిపాటి రాసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ యధాతధంగా మీ కోసం…..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో డిన్నర్ కి కెసిఆర్ కి ఆహ్వానం దక్కింది, జగన్ కి ఆహ్వానం దక్కలేదు అనే విషయం పెద్ద ఆశ్చర్యం కలిగించేది కాదు. ఇది వ్యక్తిగతమైన విషయం కానే కాదు. నిజానికి విదేశీ అధ్యక్షులకు విందు ఇచ్చే సమయంలో అనేక అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇండియా అమెరికా సంబంధాల్లో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సిటీలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే తెలుగువారికి కూడా చాలా ప్రాదాన్యత ఉంది. అసలు నిజానికి అమెరికా అధ్యక్షుడు సందర్శించాల్సిన నగరాల్లో హైదరాబాద్ కానీ బెంగుళూరు కానీ ఉండాలి కూడా., కారణమేంటో తెలియదు కానీ లేదు.. ఆ విషయం పక్కన పెట్టిన హైదరాబాద్ కి ఉన్న ప్రాముఖ్యత రీత్యా తెలంగాణా ముఖ్యమంత్రికి ఆహ్వానం తప్పని సరి. ఆదే ప్రాముఖ్యత ఆధారంగా కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం దక్కింది.
కాకపొతే జగన్ కి ఎందుకు దక్కలేదు అంటే ఇక్కడ మనం చూడాల్సింది జగన్ వ్యక్తిగత విషయంగా కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆహ్వానం దక్కలేదు అనే.,చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆహ్వానం దక్కి ఉండేది అనటంలో సందేహమే లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి అనే సిటీని బ్రాండ్ గా ఒక సంచలనం సృష్టించిన మాట వాస్తవం. అమెరికా ఇండియా సంబంధాలు మన మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా ఉండవు, అమరావతి ఇంపాక్ట్ ఏమిటో దానిలో పెట్టుబడి అవకాశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోని ఉంటాయి. ఎప్పుడైతే ఎపి ముఖ్యమంత్రి అమరావతి కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీశాడో, అప్పుడే ఎపి మీద అమెరికా కి ఇంట్రస్ట్ పోయింది , అందుకే ఈ రెండు దేశాల దౌత్యంలో ఎపి కి ప్రాధాన్యత తగ్గింది. నిజానికి అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల్లో గుజరాతీయుల తర్వాత ఆంద్రప్రదేశ్ జనాభా నే ఎక్కువ. అందుకే తెలుగు సంస్థల ఆహ్వానాలకి అక్కడి రాష్ట్ర గవర్నర్లు కూడా స్పందిస్తుంటారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాబా ఇప్పుడు అమెరికా లో కూడా హైదరాబాదీలుగానే గుర్తింపబడాలి, మరో మార్గం లేదు. ఇక డిన్నర్ విషయానికొస్తే అమెరికా ఇంట్రస్ట్ ప్రకారమే ఆ డిన్నర్ అతిధుల జాబితా తయారు చేయబడుతుంది, అమెరికా కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. తెలుగువాళ్ళ కోసం ఒక్క హైదరాబాద్ ని తీసుకుంటే చాలు. అందుకే జగన్ కి ఆహ్వానం రాలేదు.
అమరావతి ఒక బ్రాండ్ గా అలాగే వెలుగులు చిమ్ముతూ ఉంటే అదే మన ట్రంప్ కార్డ్ అయ్యేది. ట్రంప్ ఆ ట్రంప్ కార్డ్ ని తీసుకోక తప్పని పరిస్థితి ఎదురయ్యేది.
డిన్నర్ చేయటం కాదు సమస్య.. అక్కడ స్టేట్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ అనేదే సమస్య.. ఇప్పుడు అర్థమయ్యిందా మనం ఏం కోల్పోయామే..
అన్నట్లు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సియం గా ఉన్నప్పుడు, అప్పటి అమెరికా అధ్యక్షుడు హైదారాబాద్ కి వస్తే ఆయన పక్కన డ్వాక్రామహిళలని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సియం కనీసం ఇప్పటి అమెరికా అధ్యక్షుడి డిన్నర్ కి ఆహ్వానం అందుకోలేకపోయాడు. సమస్య వ్యక్తులది కాదు, ఆ వ్యక్తిత్వాలది.. విజన్ ది.. అర్థం చేసుకోగలిగినవారికి అర్థం అవుతుంది.