Showing posts with label సౌజన్యం రాజేష్ మన్నేపల్లి. Show all posts
Showing posts with label సౌజన్యం రాజేష్ మన్నేపల్లి. Show all posts

Saturday, 6 June 2020

మ్యాంగో కుల్ఫీ Mango kulfi

మ్యాంగోకుల్ఫీ
నేనే  తయారు చేశాను, చాలా బాగుంది.

పాలు 3/4 లీటరు, పంచదార 6 టీస్పూనులు, సన్నగా తరిగిన బంగినపల్లిమామిడిపండు ముక్కలు ఒకకప్పు, సన్నగాతురిమిన బాదంపప్పులు పది, సగ్గుబియ్యం రెండు టీస్పూనులు బరకగా మిక్సీ వేసుకోవాలి.

ఫుల్ క్రీమ్ పాలని వెడల్పు పాత్రలో పోసి, పంచదారకూడా కలిపి మధ్య సెగన  సగమయ్యేవరకూ మరిగించాలి. సగమయ్యాక సగ్గుబియ్యంపొడి, బాదం తరుగు కలిపి మరికాసేపు మరిగించాలి. చిక్కగా అయిన తరువాత స్టవ్ ఆపేసి మామిడిపండు ముక్కలు కలిపి, టీ గ్లాసుల్లోకి సర్దాలి. వేడిపూర్తిగా తగ్గాక ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు స్పూనులు గుచ్చి ఫ్రీజర్ లో నాలుగు గంటలుంచితే కుల్ఫీరెడీ.

ఒక్కసారి చేశారంటే ఇక ఎప్పుడూ బయట కొని తినరు. ఎప్పుడూ ఇంట్లోనే చేస్తారు. అంత బాగుంది.