Saturday, 4 November 2017

మొలహాపొడి (ఇడ్లీ చెట్నీ)

అయ్యా! మొలహా పొడి అంటే ఒక పౌడర్ చట్నీ అండి. దీన్ని దక్షిణాది లో "మొళగాపుడి" అనికూడా అంటారు. తమిళంలో మొళగా అంటే మిరియాలు.
మినప్పప్పు+శనగపప్పు+మిరియాలు+ఎండుమిర్చీ+ఇంగువ ఇలాంటి కాంబినేషన్ తో కొద్దిగా నూనెలో వేయించి సాల్ట్ కలిపి ఉంచుతారు. ఇడ్లీలు లేదా దోశలతో నంజుకొని తింటారు.  ఇలా తినేసమయంలో ఈ పౌడరు లో మంచి నేయిగానీ, నువ్వులనూనె గానీ తగుమాత్రం add చేస్తారు.
మీ దగ్గరలో ఉన్న మద్రాసీ shops లో try చేయండి. చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. లేదా MTR Idly chutney పౌడర్ అని అడిగి తీసుకోండి. All the best..

Friday, 3 November 2017

కర్వేపాకు పచ్చడి

కరివేపాకు పచ్చడి తయారు విధానం 🍜🍜🍜
పోయ్యమీద  పెనం వేడి చేసి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించాలి తరువాత టొమాటో ముక్కలు చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి ఇప్పుడు రోటిలో ఇవన్నీ వేసి బాగా దంచూకోవాలీ తరువాత ఉప్పు తగినంత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దంచూకోవాలీ అంతే కరివేపాకు పచ్చడి రెడీ
ఈ పచ్చడి ఇడ్లీ లోకి సూపర్ ఆండీ

Wednesday, 1 November 2017

గోంగూర పచ్చడి

Guntur special gongura pachadi. Endu mirchi, menthulu, aavaalu, (minappappu) inguva vesi oil lo veyinchukovali. Next gongura veyinchaali. Cool ayyaka rotlo salt vesi danchaali. Vedi vedi annamlo gongura pachadi, neyyi vesukoni onions nanchukoni tinte superga vuntundi. Amantaaru.....

కందిపచ్చడి

Oil lakunda 1 cup small size khandipappu tesukonta 8 red chillys small spoon jeera e 3 items oil lakunda vapali vatini rubbali koncham chintapandu water, (istam vunta garlic 2 todamalu), 4 karivapaku leafs vachi rubbandi ladha mix pattandi.  (chintapandu akkarlanivallu 1 lemon slice rasam vachina bhaguntadi pulla pullaga).

బాణలి వేడయ్యాక మీడియం మంటలో పెట్టి, 1 కప్పు కందిపప్పు, 6 ఎండు మిర్చి, ఒక చెంచా జిలకర, కొంచెం చింతపండు వేసి దోరగా వేగి కమ్మగా వాసన వచ్చేవరకు వేపి మంట కట్టేసి చల్లారాక రోట్లో కాసేపు దంచి, నీళ్లు చల్లుకుంటూ పొత్రంతో మెత్తగా రుబ్బుకుని గిన్నెలో తోడి, బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జిలకర, రెండు ఎండు మిర్చి త్రుంచి వేసి, కరేపాకు వేస చిటపట అన్నాక రుబ్బుకున్న కందిపప్పు పచ్చడిలో వేసి కలిపి మూత పెట్టాలి. అన్నం లో కందిపప్పు పచ్చడి, నెయ్యి వేసి కలుపుకుని తినడమే.

కొత్తిమీర పచ్చడి

మూకుడులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, వహ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి తరావత కొత్తిమీర, చింతపండు, ఉప్పు వేసి రోటీ లో మెత్తగా రుబ్బుకోవాలి.(ఉల్లిపాయ ముక్కలు వేసిన బాగుంటుంది).

ఉసిరికాయ పచ్చడి

మా ప్రాంతాలలో ఉసిరిక పచ్చడి చేస్తారు. మరి ఉప్పుకలిపి ఉంచిన ఊరగాయ మడికి ఎట్లా పనికి వస్తుందని సందేహమా? దానికి కూడా మార్గాలు కనిపెట్టారు పెద్దవాళ్ళు.

కాయలను తరిగో దంచో మెత్తగా చేస్తాము కదా, అవి మూడవనాటికి బాగా మెత్తబడతాయి అప్పుడు ఆ మెత్తటి ముద్దను పెద్దపెద్ద వడియాలలాగా చేసి ఎండబెడతారు.

ఎండబెట్టే ముందరే మధ్యలో ఒక పురికొస పట్టేటంత రంధ్రం చేసి మరీ ఎండలో పెట్టి వడియాలలాగా గలగల ఎండేదాకా ఉంచి అప్పుడు ఆ ఎండిన ఉసిరి వడియాలను తాడులో గుచ్చి దండలాగా చేసి గోడకు వేళ్ళాడతీస్తారన్న మాట. పచ్చడి చేసుకొనే గంట ముందు ఆ వడియం చిదిపి నీళ్ళల్లో వేస్తే మెత్తగా అయిపోతుంది.

అందులో ఇంగువ మెంతులతో తిరగమాత వేస్తే........ ఆహా నోట్లో నీరూరుతుంది కదా. పెళ్ళయి వచ్చిన కొత్తల్లో వంటింట్లో సీలకు వేళ్ళాడేసిన వడియం దండను చూసి, ఇదేమిటి పిడకలు వంటింట్లో పెట్టుకున్నారు అని బోల్డు హాశ్చర్యపోయాను.

మరొక మినహాయింపు. కార్తికమాసంలో ద్వాదశి రోజు ఉసిరిక కాయ సగానికి కోసి తులసి దగ్గర దీపాలు పెట్టటం కొమ్మ తులసికోటలో పెట్టి పూజచేయటం మీకందరికీ తెలిసిందే కదా!. కాని........ ఆ రాత్రి తప్పనిసరిగా ఉసిరిక పచ్చడితో భోజనం చేయాలట. ఆ రోజు కూడా ఈ వడియాంతోనే పచ్చడి.

సరే ఉపోద్ఘాతం అయింది కదా!  ఓస్ ఇంతేనా, మాక్కూడా తెలుసోయ్ అని అంటారు కాని తెలియని వాళ్ళ కోసం.

1. ఒకప్పుడు........ ఉసిరిక్కాయలను కడిగి ఆరిన తరువాత రోట్లో వేసి ఇనప పొన్ను ఉన్న రోకలితో చాలా జాగ్రత్తగా గింజ నలక్కుండా దంచి, చేటలో చెరిగి గింజలు ఏరి అంటుకున్న తొక్కు ఊడే దాకా మళ్ళీమళ్ళీ ఇదే ప్రొసీజరు. మధ్యమధ్యలో ఇనప పొన్ను నీలంగా అవుతుంటుంది. అంటే తుప్పొస్తుందన్నమాట. మాటిమాటికి ఆ పొన్ను శుభ్రమైన బట్టతో తుడవాలి. ఎంత తలకాయ నొప్పో కదా.
2. మా తరం...... రోలూ రోకలి అవతల పారేసి కత్తిపీట నుండి కత్తి దాకా ఏదైనా ఫరవాలేదు, గింజకు అంటుకున్న పెచ్చు చివరంటా తరిగేసి మొత్తమంతా మిక్సీలో తిప్పేయటమే. ఖతం.
3. ఈ తరం.......... అయిదేళ్ళ క్రితం అట్లా చాకుతో తరుగుతుంటే, అవి నాటు కాయలు, ఈ రోజుల్లో వచ్చే హైబ్రిడ్ నిమ్మకాయంత సైజువి కాదు. తరుగుతూ...తూ...తూఉంటే, వేలుకు బొబ్బరావటం చితికి పుండవటం నరకం చూపించింది.

ఇహ అట్లా కాదని ఒక చిన్న ట్రయల్ వేసా. ఓ పదికాయలు, బౌల్ లో వేసి మైక్రోవేవ్ లో పెట్టి నాలుగు నిమిషాలకు తీసేటప్పటికి చక్కగా మెత్తబడ్డాయి. చల్లారితే మళ్ళీ గట్టి పడతాయి. వేడి మీదనే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి గుండ్రాయిలాంటి పరికరంతో దెబ్బకొట్టగానే, నా సామిరంగా ఎంచక్కా ముక్కలకు ముక్కలు, గింజ విడిపోయాయి.

ఇంక ఆనందం పట్టలేక మిగిలిన కాయలన్ని డిటో. కాని.........ఉడికీ ఉడకనట్టున్న ఉసిరికతో పచ్చడి నిలువ ఉంటుందా అని భయంతో విడిగానే పెట్టాను. ఆహా ఏం రుచి అనిపించేలా వచ్చింది పచ్చడి. అప్పటి నుండి అదే పద్ధతి. ఐదు కిలోల కాయలు అరగంటలో జాడీకెక్కేసాయి.

నూనెలో వూరబెట్టే ఉసిరి ఆవకాయకు కూడా ఎక్కువగా నూనె పట్టకుండా ఉండాలంటే కూడా ఇదే చిట్కా. ముందుగా మైక్రోవేవ్ లో మెత్తబడ్డాక నూనెలో వేస్తే అట్టే నూనె పీల్చదు.

అట్లా గింజలు సులభంగా విడదీసి ముక్కలతో ఎంచక్కా ఆవకాయ పెట్టేసుకోవచ్చు.

రసగుల్లాలు

ఈరోజు మావారి పుట్టినరోజు.
ఈ సందర్భంగా రసగుల్లా తయారు చేశాను.
ముందుగా పాలు విరగ్గొట్టి, నీరు లేకుండా వడగొట్టి
ఆ ముద్దని బాగా మర్దన చేసి,
ఉండలుగా చేసుకోవాలి .
ఇంకో పక్క పంచదార పాకం పట్టకోవాలి...
పాకం తెర్లుతుండగా తయారు చేసుకున్న ఉండలను వేయాలి
కుక్కరులో కొంచెం నీళ్ళు పోసి ఆ ఉండలు వేసిన పాకం గిన్నెని కుక్కరు లో పెట్టి విసిల్ వచ్చే ముందు simలో ఉంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే రసగుల్లాలు తయారు....